ఉపేక్షించేది లేదు.. కఠినంగా వ్యవహరిస్తాం..
పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ అనేది ఇప్పటి వరకు లేదు. ఈ ఘటనే మొదటిది. ర్యాగింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిస్తాం. పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులకు పనిష్మెంట్ కింద 20 రోజుల పాటు ఇంటికి పంపించాం. దీనిపై డీఎంఈకి నివేదిక అందజేస్తాం. మున్ముందు ర్యాగింగ్ అనే పదం కళాశాలలో వినిపించొద్దు. ర్యాగింగ్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టి.. పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళల్లో వసతి గృహాల వద్ద వార్డెన్లు, ఇతర సిబ్బందికి విధులు కేటాయించాం.
– డాక్టర్ రమేష్, ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్
త్వరలోనే ర్యాగింగ్‌పై ప్రత్యేక సదస్సు
మెడికల్ కళాశాలలో త్వరలోనే ర్యాగింగ్‌పై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తాం. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై సెక్షన్–4 కింద కేసులు నమోదు చేస్తాం. ఆరు నెలల నుంచి నుంచి ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా ఉంటుంది. ఇప్పటికే రూరల్ పోలీసు సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ తిరగడానికి ఆదేశాలు ఇచ్చాం. మెడికల్ కళాశాల ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పటికే కళాశాల డైరెక్టర్‌తో ఈ విషయంపై చర్చించడం జరిగింది. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment