ఆలస్యమైతే అనుమతించం
వనపర్తి: జిల్లాలో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్–3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించాలని.. ఆలస్యమైతే అనుమతించమని కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8,312 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని.. ఇందుకోసం 31 కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. నవంబర్ 17న పేపర్–1 ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా.. అభ్యర్థులను 8.30 వరకే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు. పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుండగా 1.30 వరకే కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. నవంబర్ 18న పేపర్–3 పరీక్ష ఉదయం 10కి ప్రారంభమవుతుందని వివరించారు. పరీక్షకు వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్‌కార్డుగాని మరేదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపుకార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. అభ్యర్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తామని చెప్పారు.
గురుకుల పాఠశాల తనిఖీ..
మదనాపురం: మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల, కళాశాలను గురువారం రాత్రి కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, విద్యార్థులతో కలిసి భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఇంటర్ విద్యార్థులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. వసతులు ఎలా ఉన్నాయి, చదువు ఎలా చెబుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టి చాక్లెట్లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు బట్టి విధానాన్ని వీడాలని.. మెదడుకు పదునుపెట్టి స్వయంగా ఆలోచించినప్పుడే ఉన్నతంగా రాణించగలరని సూచించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కృత్రిమ మేధాతో పాటు మరెన్నో కొత్త కోర్సులు అందుబాటులో ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకొని ఆయారంగాల్లో తమదైన శైలిలో రాణించాలని కోరారు. వారి వెంట తహసీల్దార్ అబ్రహం లింకన్, ప్రిన్సిపల్ పరమేశ్, డా. పి.ఆనంద్,
సిబ్బంది తదితరులు ఉన్నారు.
గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు
31 కేంద్రాలు
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment