దళారులను నమ్మి మోసపోవద్దు
పాన్‌గల్: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని తెల్లరాళ్లపల్లి, చిక్కేపల్లి, శాగాపూర్, కదిరెపాడు, మాధవరావుపల్లి, బహుదూర్‌గూడెం, బండపల్లిలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను మండల నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని, గ్రామాల్లో ప్రైవేట్ వ్యాపారులు తిరుగుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటేనే తూకం చేయాలని, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి డబ్బులు త్వరగా వారి ఖాతాల్లో జమ చేయాలని సిబ్బందికి సూచించారు. కేంద్రాల్లో నీడ, తాగునీటి వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్లు సాయిప్రసాద్‌గౌడ్, బీక్యానాయక్, బిచ్చమ్మ, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, మాజీ జెడ్పీటీసీ రవికుమార్, భాస్కర్‌యాదవ్, రాముయాదవ్, బ్రహ్మయ్య, బాలరాజుయాదవ్, రామ్మూర్తి నాయుడు, రామకృష్ణ, లక్ష్మయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment