ఈ దందాలో రేషన్ డీలర్లే కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు డీలర్లు లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకొని బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం. తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎక్కువ ధరకు దళారీ వ్యాపారం చేసే వారికి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మదనాపురం మండంలోని అన్ని గ్రామాల్లో బియ్యం వ్యాపారులు ఉన్నారు. మండలంలోని గోపన్‌పేటలో అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. ఇళ్లల్లో నిల్వ చేసి బియ్యం ఉన్న సమాచారంతో సివిల్ సప్లై అధికారులు దాడి చేసి బియ్యాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 30కి పైగా 6–ఏ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంపై డీసీఎస్‌ఓ కాశీవిశ్వనాథ్‌ను వివరణ కోరేందుకు మూడురోజులుగా ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment