గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
వనపర్తి: జిల్లా గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో ఆగ్రో ఎకాలజీ యంగ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఇంకా చేయాల్సిన పనులు ప్రాధాన్యత క్రమంలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించనట్లు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మాను సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులను ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో వినియోగించాలని సూచించారు. రైతులకు సారవంతమైన భూమి, నాణ్యమైన విత్తనాలు, సాగునీరు, మార్కెటింగ్ సౌకర్యం అందించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారి సరైన ఆదాయం సమకూరుతుందని చెప్పారు. పాడి ఉత్పత్తి, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. యువతకు ఉపాధి అవకాశాలపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు వెంకటరమణయ్య, డా. విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షుడు
డా. జి.చిన్నారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment