సైన్స్‌పై పట్టు సాధించాలి
వనపర్తి: గ్రామీణ విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సరైన సైన్స్ కిట్లు లేకపోవడంతో విద్యార్థులు సబ్జెకులో వెనుకబడుతున్నారని.. వారిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సైన్స్ కిట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం స్థానిక సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 52వ రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. సైన్స్ అంటే నిజమని విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని స్ఫూర్తి పొంది భవిష్యత్‌లో ఐఐటీ, ఎయిమ్స్ వంటి కళాశాలల్లో సీట్లు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. విద్యాపరంగా జిల్లా ఏళ్లుగా ముందుందని.. పాలిటెక్నిక్, పీజీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలు జిల్లాకేంద్రంలో ఉన్నాయన్నారు. డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. మూడురోజుల పాటు కొనసాగే వైజ్ఞానిక ప్రదర్శనను విద్యార్థులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. ఈ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని డిసెంబర్ మొదటి వారంలో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు పంపిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇన్స్‌పరేషన్ అవార్డుల్లో మొదటిస్థానం పొందిన వారికి స్కాలర్‌షిప్ అందుతుందన్నారు. జిల్లా విద్యార్థులు విజ్ఞానశాస్త్ర పరంగా అభివృద్ధి సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాలల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని విద్యార్థిలోని నైపుణ్యాన్ని వెలికి తీసేవిధంగా బోధన ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
52వ రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment