చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
వనపర్తి విద్యావిభాగం: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమె హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, వరద బాధితులు, రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్న వారు ఉచిత న్యాయ సాయం పొందవచ్చని.. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100కి కాల్ చేయాలని, అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సాయం పొందవచ్చని వివరించారు. బాలలతో పనులు చేయించడం నేరమని.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సఖి కేంద్రం లీగల్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, కార్యనిర్వాహకురాలు కవిత, ప్రధానోపాధ్యాయుడు ఆనందబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment