పకడ్బందీగా రహదారి భద్రత మాసోత్సవాలు
వనపర్తి: జిల్లాలో రహదారి భద్రత మాసోత్సవాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ప్రధాన రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు విధిగా రహదారి నిబంధనలు పాటించని సూచిస్తున్నామని.. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని పోలీస్, రవాణాశాఖ అధికారులను ఆదేశించామన్నారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశాలు తరచూ నిర్వహిస్తూ సమీక్షిస్తున్నట్లు చెప్పారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం, రాంగ్ రోడ్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించని, ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్లను గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించామని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, డీఎస్పీ, ఆర్డీఓ రోడ్డు భభద్రత వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీటీఓ మానస, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, రోడ్లు భవనాలశాఖ డీఈ సీతారామస్వామి ఎన్‌ఐసీఐఆర్ ఏడీ మురళీకృష్ణ, డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment