బ్యాలెట్ పత్రాల ముద్రణకు..
బ్యాలెట్ పత్రాల ముందస్తు ముద్రణకు పాలమూరులోని ఓ ప్రింటింగ్ సంస్థకు టెండర్ ఖరారు చేశారు. రెండు నుంచి 12 గుర్తుల వరకు వేర్వేరుగా సర్పంచులు, రెండు నుంచి ఐదు గుర్తుల వరకు వార్డు సభ్యుల ఎన్నికకు బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అవసరం మేరకు మిగతా బ్యాలెట్ పత్రాల ముద్రణ చేయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి బ్యాలెట్ పత్రాల ముద్రణకు కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత ఎన్నికల అభ్యర్థుల అంచనా మేరకు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికకు గరిష్టంగా 30 గుర్తులు, వార్డు సభ్యుడి ఎన్నికకు గరిష్టంగా 20 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment