మహనీయుడు లూయిస్ బ్రెయిలీ
వనపర్తి: అంధుల కోసం ప్రత్యేక లిపిని తయారుచేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై అంధులతో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. అంధులు సామాన్యులతో సమానంగా అన్నిరంగాల్లో రాణించేందుకు లూయిస్ బ్రెయిలీ ఆరు చుక్కలతో లిపిని రూపొందించారన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు పెరవలి గాయత్రి, బ్యాంకు ఉద్యోగి మధు ఇందుకు ఉదాహరణ అని వివరించారు. అనంతరం వారిద్దరితో సహా పలువురు అంధులను అదనపు కలెక్టర్ సన్మానించి వాకింగ్ స్టిక్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది, వివిధ గ్రామాల అంధులు పాల్గొన్నారు.
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
Comments
Please login to add a commentAdd a comment