‘పది’లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
వనపర్తి: మార్చిలో జరిగే పదోతరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై విద్యా శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తేదీలోపు సిలబస్ పూర్తిచేసి సంక్రాంతి తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల వారీగా విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో గుర్తించి ఆయా విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు కూడా నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. సమా వేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment