న్యాయసేవలు వినియోగించుకోవాలి
వనపర్తి టౌన్: ప్రజలకు న్యాయసేవలను చేరువ చేసేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. మంగళవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పారా లీగల్ వాలంటీర్ల శిక్షణకు ఆమె హాజరై మాట్లాడారు. న్యాయసేవలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని.. చట్టానికి అందరూ సమానులే అనే దృక్పథం సమాజంలో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగులకు చట్టపరంగా విశేష హక్కులు ఉంటాయని.. వాటిని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని సూచించారు. ఉచితంగా న్యాయసేవలు అందించేందుకు సంస్థ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రజిని, రవికుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మోహన్‌కుమార్, న్యాయవాది డి.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత
Comments
Please login to add a commentAdd a comment