మతాలను గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మతాలను గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలి

Published Mon, Sep 16 2024 1:24 AM | Last Updated on Mon, Sep 16 2024 1:24 AM

మతాలను గౌరవిస్తూ పండుగలు జరుపుకోవాలి

వరంగల్‌ క్రైం: అన్ని మతాలను గౌరవిస్తూ.. సంతో షాల నడుమ పండుగలను జరుపుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపా రు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఆది వారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ట్రైసిటీకి చెందిన ముస్లిం మత పెద్దలు, శాంతి కమిటీతో సమావేశం జరిగింది. ఈనెల 16న మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా.. అదే రోజు గణేశ్‌ నిమజ్జనం ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముస్లిం మత పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి ఈనెల 19న మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాల్ని నిర్వహించేందుకు ముస్లిం మత పెద్దలంతా అంగీకరించినట్లు సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతీ మతం వారు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ వారి పండుగలకు సంబంధించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం వరంగల్‌ నగరవాసుల ప్రత్యేకత అని అన్నారు. మత సామరస్యంలో వరంగల్‌ ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తోందని.. ఇదే సంప్రదాయాన్ని భావితరాలవారికి అందజేయాలని ఆయన సూచించారు. కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ వేళ మత సామరస్యంలో భాగంగా ఎంతోమంది ముస్లిం యువకులు గణేశ్‌ విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశారని పేర్కొన్నారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నిమజ్జనం కోసం తరలివెళ్లే భక్తులకు మార్గమధ్యలో మంచినీరు, మజ్జిగను అందించడం జరుగుతుందని ఖుస్రూ పాషా తెలిపారు. సమావేశంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ రవీందర్‌, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, నందిరాంనాయక్‌, దేవేందర్‌రెడ్డి, కిషోర్‌, తిరుపతి, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement