హర హర మహాదేవ..
ఆత్మకూరు: మండల కేంద్రంలోని పార్వతీ సమేత మహాదేవ పంచకూట శివాలయ పునః ప్రతిష్ఠాపనోత్సవాలు వేదపండితుల మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్య సంఘోషణ, గణపతి పూజ, భూత బలి, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, యంత్ర విగ్రహ మార్జనం, అఖండ దీపారాధన, నీరాజన మంత్ర పుష్పాలు, తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలను ఉదయం నిర్వహించారు. సాయంత్రం అంకురారోపన, మహా మంటప ఆవాహన, అగ్నిప్రతిష్ఠాపన, నవ కలశార్చన, ద్వాదశ ఆలాపన, జలాదివాస సహిత్ క్షీరాభిషేకం, నీరాజన మంత్రపుష్పాలు, రాజోప చరములు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు చేసి విగ్రహాలను నూతన ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ అర్చకులు వచ్చునూరు శ్రావణ్‌శర్మ, శరత్‌శర్మ, రవీందర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు శానగొండ శివకిరణ్ ఆధ్వర్యంలో పండితులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హర హర మహాదేవ, శివనామ స్మరణతో ఆత్మకూరు మార్మోగింది. ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో అన్నదాన నిర్వహించారు. మూడు రోజులపాటు అన్నదానం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పునర్నిర్మాణ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, దాతలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆత్మకూరులో ప్రారంభమైన పంచకూట శివాలయ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు
విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన
అర్చకులు, వేద పండితులు
ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజులు అన్నదానం
Comments
Please login to add a commentAdd a comment