పకడ్బందీగా సర్వే నిర్వహించాలి
బీసీ సంక్షేమ శాఖ డీడీ రాంరెడ్డి
కమలాపూర్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, కమలాపూర్ మండల ప్రత్యేకాధికారి రాంరెడ్డి, ఎంపీడీఓ గుండె బాబు ఎన్యుమరేటర్లకు సూచించారు. మండలంలోని ఉప్పల్‌లో రాంరెడ్డి, కానిపర్తి, శంభునిపల్లి, కమలాపూర్ గ్రామాల్లో ఎంపీడీఓ బుధవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేస్తున్నట్లు తెలిపారు. పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని సూచించారు. మండల వ్యాప్తంగా 24 గ్రామాల్లో సుమారు 19,603 గృహాలు ఉన్నాయని, 165 మంది ఎన్యుమరేటర్లు, 20 మంది సూపర్‌వైజర్లు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 8 వరకు స్టిక్కర్లు అంటించి, 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు తమ బ్లాకుల పరిధిలోని ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కార్యక్రమాల్లో ఎంపీఓ రవి, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment