సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య
దామెర: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య సూచించారు. మండలంలోని ఊరుగొండ, ల్యాదెళ్ల, కోగిల్వాయిలో బుధవారం ఆయన పర్యటించి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మందుల స్టాకు వివరాలు, వ్యాధి నిరోధక టీకాలు (ఇమ్యూనైజేషన్) కార్యక్రమం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పిల్లలు, గర్భిణులు, మహిళలకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బంది సమన్వయంతో పనిచేసి గర్భిణులను నమోదు చేయాలని, పరీక్షలు చేసి టీకాలు వేయాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు సేవచేయాలని, పీహెచ్‌సీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ల్యాదెళ్ల, కోగిల్వాయిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పనులు త్వరితగతిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట పల్లె దవాఖాన వైద్యులు వనజ, రాధాశాంతిప్రియ, పీహెచ్‌ఎన్ లీలా, సూపర్‌వైజర్ శ్రీకాంత్, భాగ్యలక్ష్మి, విప్లవ్ కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment