భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి
నర్సంపేట: బాల్యంలోనే భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని నర్సంపేట జైలు సూపరింటెండెంట్ లక్ష్మీశాంతి పిలుపునిచ్చారు. పట్టణంలోని మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంజీవని ఆశ్రమంలో మంగళవారం బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమను తాము ఆదర్శంగా తీసుకొని భవి ష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని చదువులో రాణించాలని కోరారు. సీడబ్ల్యూసీ మాజీ చైర్‌పర్సన్, కేయూ పాలక మండలి సభ్యురాలు కె.అనితారెడ్డి మాట్లాడుతూ బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకోకుండా చదువుకోవాలని కోరారు. డాన్‌బాస్కో డైరెక్టర్ థామస్ కోసి మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన 320 మంది విద్యార్థులు నర్సంపేటను బాలల స్నేహ జిల్లాగా మార్చేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. సీడబ్ల్యూసీ సభ్యుడు డాక్టర్ ఆకులపల్లి మధు, డాక్టర్ పరికి సుధాకర్, మాజీ సభ్యుడు కొండ మంజుల, అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్‌కుమార్, మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు డాక్టర్ మోహన్‌రావు, వినోద, కుసుమ భద్రయ్య, స్వయం కృషి సేవా సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్, సుదర్శన్‌గౌడ్, డాక్టర్ పాలడుగుల సురేందర్, డాన్‌బాస్కో సిబ్బంది జీవన్, శారద, రాజు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
నర్సంపేట జైలు
సూపరింటెండెంట్ లక్ష్మీశాంతి
Comments
Please login to add a commentAdd a comment