ఓరుగల్లుకు తరలివచ్చిన నారీ లోకం..
బుధవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2024
– 8లోu
హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం, నమస్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
నేడు ‘పింగిళి’లో
పీజీ స్పాట్ అడ్మిషన్లు
హన్మకొండ అర్బన్: పింగిళి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం నేడు (బుధవారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ (తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ) ఎంకాం (జనరల్, కంప్యూటర్ అప్టికేషన్స్), ఎంఎస్సీ (జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బాటనీ, మైక్రోబయోలజీ) కోర్సులలో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు సీపీజీఈటీ –2024లో అర్హత సాధించి ఉండాలని, లేదా డిగ్రీలో 50 శాతం మార్కుల ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత కోర్సు ఫీజుతోపాటు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు రెండు సెట్లు జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని కోరారు.
ఆర్టీసీ రీజియన్
కార్యాలయం సందర్శన
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సందర్శించారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు హనుమకొండకు వచ్చిన ఆయన కార్యాలయాన్ని పరిశీలించారు. రీజియన్ పరిస్థితిని ఆర్‌ఎం డి.విజయ భానును అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లు ఎంత దూరం వచ్చాయని అడిగారు. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయా, ఎప్పటిలోగా పనులు పూర్తవుతా యని అడిగి తెలుసుకున్నారు. వెహికిల్ ట్రాకింగ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు, అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, సిబ్బంది పాల్గొన్నారు.
రూ.10 కోట్ల ప్రాజెక్టులకు
నిట్‌తో ఎంఓయూ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌తో భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూ.10 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహించేందుకు మంగళవారం ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ వరంగల్, ఈ అండ్ ఐసీటీ అకాడమీ సౌజన్యంలో నిట్ మణిపూర్, కాకినాడ జేఎన్టీయూ, కర్నూలు ట్రిపుల్ ఐటీడీఎం, హైదరాబాద్ జేఎన్టీయూలు, భువనేశ్వర్ ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా యూనివర్సిటీలు ఎంఓయూపై సంతకం చేసినట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. ఎంఓయూ ద్వారా నిర్వహించనున్న ప్రాజెక్ట్.. 14,700 మంది అధ్యాపకులకు శిక్షణ అందించేందుకు దోహదపడనున్నట్లు తెలిపారు.
జాతీయస్థాయి స్విమ్మింగ్
పోటీలకు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24నుంచి 30వ తేదీ వరకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరగనున్న 68వ ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు హనుమకొండ డీఎస్‌ఏ క్రీడాకారులు ఎంపికయ్యారు. అండర్–19 విభాగంలో ఎంపికై న బోడిక ఆర్యచంద్రారావు, బోడిక ఆర్య చక్రాదర్‌రావులను మంగళవారం డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ అభినందించారు. క్రీడాకారుల వెంట స్విమ్మింగ్ కోచ్ రాయబారపు నవీన్‌కుమార్ ఉన్నారు.
ప్రాంగణ నియామకాలకు
రాతపరీక్ష
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ప్రాంగణ నియామకాలకు ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని సర్వోడ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈ రాత పరీక్ష నిర్వహించగా 267 మంది హాజరయ్యారు. ప్రతిభ చూపిన వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.4 లక్షల వేతనం చెల్లించనున్నారు. కేయూ ఎడ్యుకేషన్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ రమణ, డాక్టర్ భిక్షా, ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు ఎ.సిద్ధార్థ, పి.సంతోశ్, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా వీసీ ప్రతాప్‌రెడ్డిని కలిశారు.
సాక్షి, వరంగల్:
ఓరుగల్లు వేదికగా మంగళవారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు మహిళాలోకం కదిలి వచ్చింది. ఉమ్మడి జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచి మహిళలు నగరానికి తరలివచ్చారు. ఎక్కడ చూసినా వారే కనిపించారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆడబిడ్డలపై వరాల జల్లు కురిపించారు. ‘రానున్న పదేళ్లలో మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం. సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తాం. ఒకప్పుడు టాటా, బిర్లాలుంటే.. ఇప్పుడు అంబానీ, అదానీలను మించిన పారిశ్రామికవేత్తలుగా మహిళలను మారుస్తాం’ అని స్పష్టం చేశారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా..
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హనుమకొండ ‘కుడా’ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి తొలుత కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం (ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం) లో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ రూపురేఖలు మారిపోయాయి. ఓరుగల్లు పోరాటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే చారిత్రక వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అభివృద్ధికి సుమారు రూ.ఆరువేల కోట్లు కేటాయించాం. వరంగల్ అభివృద్ధి చెందితే.. సగం తెలంగాణ అభివృద్ధి చెందినట్లే. నగరాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు’ అని సీఎం చెప్పిన మాటలకు మంచి స్పందన వచ్చింది. ‘ఓరుగల్లు ఆడబిడ్డలకు మంత్రివర్గంలో ప్రముఖ స్థానం కల్పించాం. పాలకుర్తిలో ఒక రాక్షసుడిని ఓడించి అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది మన ఆడబిడ్డనే. ఆనాడు భద్రకాళి అమ్మవారు, సమ్మక్క–సారలమ్మ తల్లుల సాక్షిగా చెప్పా.. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతామని ‘మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వేదిక మీదుగా మాట ఇస్తున్నా.. మిగిలిన అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత మాది’ అనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, సారయ్య, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, కమిషనర్ అశ్వినితానాజీ వాకడే పాల్గొన్నారు.
స్టెప్పులే స్టెప్పులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్లతో పాటు పలు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో మహిళలు సభకు తరలివచ్చారు. దాదాపు లక్ష మందికిపైగా జనాలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపించింది. సీఎం రేవంత్‌రెడ్డి రాగానే.. ‘మూడు రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు మన రేవంతన్న’ అనే పాటకు మహిళలు స్టెప్పులు వేశారు. సభలో అర్జున అవార్డు గ్రహీతలు ఇషాసింగ్, నిఖత్ జరీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రేపు డెడికేటెడ్
బీసీ కమిషన్ రాక
వరంగల్: హనుమకొండ కలెక్టరేట్‌లో డెడికేటెడ్ బీసీ కమిషన్ గురువారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు, సభ్యులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు అవసరమైన రిజర్వేషన్లను దామాషా ప్రకారం కల్పించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీలు, బీసీ సంఘాలు, ప్రజలు, సలహాలు, అభ్యర్థనలు, ఆక్షేపణలను కమిషన్‌కు సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలతో సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.
న్యూస్‌రీల్
సీఎం పర్యటన సాగిందిలా...
మధ్యాహ్నం 2.39 గంటలకు: హైదరాబాద్ నుంచి హనుమకొండకు ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక.. ముందుగా నగరం మొత్తం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
2.50 : కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణంలో ప్రజాకవి కాళోజీ కాంస్య విగ్రహావిష్కరణ
2.54: హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన రూ.4,601.15 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన
2.57 : కాళోజీ కళాక్షేత్రం భవన ప్రారంభోత్సవం
2.59 : కాళోజీ కళాక్షేత్రంలో కాళోజీ ఫొటో గ్యాలరీ సందర్శన
3.18 : ఆడిటోరియాన్ని సందర్శించి.. ప్రజాకవి కాళోజీపై రూపొందించిన బయోపిక్‌వీక్షణ
3.30 : కాళోజీ కళాక్షేత్రం నుంచి బస్సులో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి పయనం
3.41 : ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణానికి రాక, ఇందిరా మహిళాశక్తి స్టాల్స్ సందర్శన
సాయంత్రం 4.16: మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికపైకి రాక, ఆ తర్వాత ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళి
5.22: సీఎం ప్రసంగం మొదలు.. 34 నిమిషాలు కొనసాగిన స్పీచ్
5.58 : 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన
6.00 : సభాస్థలి నుంచి సీఎం హైదరాబాద్‌కు పయనం
సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి దూరం
సభకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం.. మరోసారి కాంగ్రెస్‌పార్టీలో చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ పాదయాత్ర సందర్భంగా మొదలైన వీరిమధ్య మనస్పర్థలు పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఇంకా సద్దుమణగలేదన్న విషయం ఈ అతిపెద్ద సభతో మరోసారి బహిర్గతమైనట్లయ్యింది. దొంతి మాధవరెడ్డి గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా సీనియారిటీ పరంగా సముచిత స్థానమిచ్చి గౌరవించకపోవడం వల్లనే సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే దొంతి దూరంగా ఉంటున్నారని ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
కుర్చీ దొరకక..
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణికి సీటు దొరక్కపోవడంతో ఇబ్బందిపడ్డారు. వేదికపైకి.. అక్కడున్న సిబ్బంది వెనకాల కుర్చీ తీసుకొచ్చి వేయడంతో ఆమె కూర్చున్నారు.
1,158 మందికి వైద్యసేవలు
ఎంజీఎం: ప్రజాపాలన విజయోత్సవ సభా ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 1,158 మందికి వైద్య సేవలందించినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. అలాగే ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేసినట్లు తె లిపారు. మైదానంలో మూడు 108 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉంచి వైద్య సేవలందించినట్లు పేర్కొన్నారు. అదనపు డీఎంహెచ్‌ఓ టి.మదన్‌మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయకుమార్, పీఓడీటీటీ కె.లలితాదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ అహ్మద్, హిమబిందు, ఆరోగ్య శ్రీ మేనేజర్ విక్రమ్, 130 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
‘ఇందిరా మహిళాశక్తి ప్రాంగణం’
నుంచి సీఎం వరాలు
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామన్న రేవంత్‌రెడ్డి,
డిప్యూటీ సీఎం భట్టి
వరంగల్ అభివృద్ధి జరిగితే
సగం తెలంగాణ అభివృది్ధ చెందినట్లే..
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి
సభికులనుంచి అనూహ్య స్పందన
అంతకుముందు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం, పలు అభివృద్ధి
పథకాలకు శంకుస్థాపన
స్టాళ్ల పరిశీలన
హన్మకొండ చౌరస్తా: ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని సభా ప్రాంగణం ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. పెంబర్తి హస్తకళలు, చెక్క ఎద్దుల బండ్లు, చేర్యాల నకాషీ, పెయింటింగ్స్, మాస్క్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, చేనేత వస్త్రాలు, నారాయణపేట చీరలు తదితర స్టాళ్లను పరిశీలించారు. స్టాళ్ల నిర్వాహకులను వ్యాపారం ఎలా ఉంది.. ఏయే వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు.. టర్నోవర్ ఎంత? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ఇలాగే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ దర్శనం.. గొప్ప అనుభూతి అని డైరీలో రాశారు. కాగా, పలు స్టాళ్ల నిర్వాహక మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన చిత్రపటాన్ని అందజేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. వరంగల్‌లో నార్కొటిక్ పీఎస్..
ప్రారంభించిన సీఎం
– వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment