ఎంజీఎం: ఐఎంఏ ఎలక్ట్ ప్రెసిండెంట్‌గా డాక్టర్ మన్మోహన్ రాజు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు వివిధ హోదాల్లో ఎన్నికల దరఖాస్తులు అందించారు. 17 వరకు నామినేషన్లు స్వీకరించి, 19వ తేదీన విత్‌డ్రాకు సమయం ఇచ్చారు. ఈ క్రమంలో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది సెలక్ట్ ప్రెసిండెంట్‌గా డాక్టర్ నాగార్జునరెడ్డి కొనసాగనున్న క్రమంలో ఉపాధ్యక్షులుగా వేములపల్లి నరేశ్, దిడ్డి శ్రవణ్‌కుమార్, శిరీష, ప్రధాన కార్యదర్శిగా అజిత్ మహ్మద్, సంయుక్త కార్యదర్శులుగా రంజిత్‌కుమార్, కటకం విజయ్‌కుమార్, స్వప్న చావన్, ఆర్థిక శాఖ కార్యదర్శిగా శిరీషకుమార్, మరో 15 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను, ఆరుగురు బిల్డింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డాక్టర్ రాకేశ్, బందెల మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment