టీజీఓఏ జిల్లా అధ్యక్షుడిగా రాంరెడ్డి
వరంగల్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓఏ) జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా జెడ్పీ సీఈఓ జి.రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెన్నారావుపేట తహసీల్దార్ ఫణికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హనుమకొండలోని టీజీఏ భవనంలో గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులతోపాటు అసోసియేట్ అధ్యక్షురాలిగా డీఏఓ కె.అనురాధ, ఉపాధ్యక్షులుగా పీఆర్ డీఈ ఎం.చంద్రశేఖర్, డాక్టర్ బి.రాజేశ్‌రెడ్డి, డీసీఓ ఎం.నీరజ, డీటీఓ జె.విజయసారథి, డాక్టర్ బి.సుధీర్‌గౌడ్, పి.భాగ్యలక్ష్మిని ఎన్నుకున్నారు. సంయుక్త కార్యదర్శులుగా పాక శ్రీనివాసులు, కె.రాజు, సీహెచ్.యాకయ్య, బి.మధుసూదన్‌రెడ్డి, ఎన్.రవీందర్‌రెడ్డి, కె.మధురిమ, కోశాధికారిగా కె.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డి.సిరాజ్, బి.రవి, ప్రచార కార్యదర్శులుగా డాక్టర్ జి.రాజేశ్‌కుమార్, వి.సదానందం, కార్యాలయ కార్యదర్శులుగా ఎ.రాంచందర్‌రావు, డాక్టర్ మైదం రాజు, సాంస్కృతిక కార్యదర్శులుగా బి.సతీశ్‌కుమార్, పి.శ్రీకాంత్, క్రీడా కార్యదర్శులుగా జీ.సుధీర్‌కుమార్, ఎండీ.ఇస్మాయిల్, ఈసీ మెంబర్లుగా బి.విజయనిర్మల, బింగి హేమలత, కె.శ్రీధర్, ఎస్.శ్రీలక్ష్మి, పి.పవిత్ర ఎన్నికయ్యారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
కాళోజీ సెంటర్: ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, పెండింగ్ బిల్లులు, నాలుగు డీఏలు చెల్లించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, ప్రాథమిక పాఠశాలకు పదివేల ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని, ఎస్టీజీలకు ఎల్‌ఎఫ్ ఎల్ పదోన్నతులు ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ముజాహిద్ అలీ, కార్యదర్శి పి.సురేశ్‌బాబు, జగన్‌మోహన్, వీరస్వామి, మల్లికార్జున్, ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment