ఇమ్యునైజేషన్‌పై అవగాహన అవసరం
గీసుకొండ: కొత్తగా సవరించిన ఇమ్యునైజేషన్ విధానంపై వైద్యులు, సిబ్బందికి పూర్తి అవగాహన అవసరమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యాధికారులు, సిబ్బందికి సార్వత్రిక ఇమ్యునైజేషన్‌పై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్‌సీల సేవల గురించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ఆయన అధికారులతో కలిసి విడుదల చేశారు. స్టేట్ నోడల్ టీం సభ్యులు డాక్టర్ మురహరి, డాక్టర్ అతుల్, డాక్టర్ జ్యోత్స్న, డేవిడ్ సవరించిన ఇమ్యునైజేషన్ గురించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు మోహన్‌సింగ్, డెమో అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
Comments
Please login to add a commentAdd a comment