సాక్షిప్రతినిధి, వరంగల్ :
హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ను తమ వ్యాపారానికి కేంద్రంగా మార్చుకున్నారు గంజాయి విక్రయదారులు. కొత్త పంథాలో, సరికొత్త ఎత్తుగడలతో గంజాయిని తరలిస్తూ విక్రయిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలతో చెక్ పెడుతున్నప్పటికీ.. మూడు దమ్ములు.. ఆరు కిక్కులు అన్నట్లుగా ఉమ్మడి జిల్లాలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈజీ మనీ కోసం కొందరు ముఠాగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు. విశాఖపట్నం, ఒడిశా నుంచి వరంగల్ మీదుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న ముఠా.. నగరంలోనూ ఏజెంట్లను ఏర్పరుచుకుని గంజాయి విక్రయిస్తోంది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (డబ్ల్యూఎన్‌పీఎస్)ను మంగళవారం ప్రారంభించారు. ఈనేపథ్యంలో వరంగల్‌ను డ్రగ్స్ ఫ్రీ కేంద్రంగా మార్చేందుకు మరింత సీరియస్‌గా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
స్కూల్ స్థాయి నుంచే..
యువతతో పాటు కొందరు స్కూల్ స్థాయి నుంచే గంజాయి వినియోగిస్తున్నారు. రాత్రి సమయంలో కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతా లు, వరంగల్, హనుమకొండ బస్‌స్టేషన్ ఆవరణ లు, వరంగల్‌లోని ఉర్సు గుట్ట, చిన్నవడ్డేపల్లి చెరు వు, రంగశాయిపేట బెస్తం చెరువు, ఖిలావరంగల్ గుండు చెరువు, రాతికోట, ఏనుమాముల మార్కెట్ శివారు, కాకతీయ కెనాల్ ప్రాంతాలు, హనుమకొండలోని బంధం చెరువు, న్యూశాయంపేట రైల్వే ట్రా క్, ఔటర్ రింగ్ రోడ్డు, పలివేల్పుల, వడ్డేపల్లి చెరువు కట్ట, హాస్టళ్లు, అద్దె రూములను అడ్డాగా చేసుకొని విద్యార్థులు బృందాలుగా ఏర్పడి గంజాయి తాగుతున్నారు. ఇటీవల అమ్మాయిలు సైతం గంజాయికి అలవాటు పడుతున్నట్లు తెలిసింది.
కట్టడి చేసేందుకు డబ్ల్యూఎన్‌పీఎస్..
డ్రగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు వరంగల్ నార్కోటిక్స్ పోలీస్ట్ స్టేషన్ (డబ్ల్యూఎన్‌పీఎస్)ను ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఇక్కడే హెడ్‌క్వార్టర్‌గా డీఎస్పీ నేతృత్వంలో పోలీసు బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.88 కోట్ల విలువైన 35,319 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 389 కేసులు నమోదు చేసినట్లు అధికారులు డబ్ల్యూఎన్‌పీఎస్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు.
పట్టుబడిన గంజాయి, కేసులు, విలువ
Comments
Please login to add a commentAdd a comment