పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Published Sat, Nov 23 2024 12:58 AM | Last Updated on Sat, Nov 23 2024 12:58 AM

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

దుగ్గొండి: ఉపాధ్యాయులకు పెండింగ్‌ డీఏలు, జీపీఎఫ్‌ రుణాలు, పార్ట్‌ బిల్లులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు ఎంఏ.అజీజ్‌ ఉద్యోగ విరమణ సభ శుక్రవారం హెచ్‌ఎం రామస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజీజ్‌ను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. అనంతరం శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. త్వరలోనే ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సాధించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పిస్తామని, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అజీజ్‌ తన సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి రవీందర్‌రెడ్డి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, నాయకులు అబ్దుల్‌గఫార్‌, తిరుపతిరెడ్డి, శ్రీహరి, పోలోజు భిక్షపతి, సుధాకర్‌రెడ్డి, నక్కిరెడ్డి, మహేందర్‌, రాజేందర్‌, భాస్కర్‌, సురేందర్‌, ప్రతాప్‌సింగ్‌, యాకూబ్‌రెడ్డి, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

పింగిళి శ్రీపాల్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement