ఎట్టకేలకు రెండు జెడ్పీల ఏర్పాటు
హన్మకొండ: ప్రభుత్వం ఎట్టకేలకు హనుమకొండ, వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేసింది.ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 68 విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు వరంగల్ అర్బన్ జెడ్పీగా కొనసాగగా ఇకనుంచి హనుకొండ జిల్లా ప్రజాపరిషత్‌గా, వరంగల్ రూరల్ జెడ్పీ.. వరంగల్ జెడ్పీగా కొనసాగనుంది. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. ఈ క్రమంలో పూర్వ వరంగల్ జిల్లాలోని మండలాలను ఆరు జిల్లాల్లో కలిపింది. 2019లో మరోసారి జిల్లాల పునర్విభజన జరుగగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు డివిజన్‌లోని మండలాలను కలుపుకుని ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. 2016లో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేయగా జనగామ నియోజకవర్గంలోని మద్దూరు, చేర్యాల మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపారు. దీంతో పూర్వ వరంగల్ జిల్లాలోని మండలాలు ఏడు జిల్లాల్లోకి వెళ్లాయి.
2021లో రెండు జిల్లాల పేర్లు మార్పు..
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా ఉండడం బాగా లేదని, దీనిపై అభ్యంతరాలు రావడంతో 2021 ఆగస్టు 12న వరంగల్ అర్బన్‌ను హనుమకొండ, వరంగల్ రూరల్‌ను వరంగల్ జిల్లాలుగా ఏర్పాటు చేసింది. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఉన్న పరకాల డివిజన్‌లోని 5 మండలాలు, వరంగల్ అర్బన్ జిల్లాలోని 9 మండలాలు కలిపి మొత్తం 14 మండలాలతో కలిపి హనుమకొండ రెవెన్యూ జిల్లాగా ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మిగతా 13 మండలాలతో కలిసి వరంగల్ రెవెన్యూ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటికే జిల్లా ప్రజాపరిషత్‌లకు పాలక మండళ్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు హనుమకొండ నగర పరిధిలోని రెండు మండలాలు మినహాయించి 12 మండలాలతో హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్, వరంగల్ నగర పరిధిలోని రెండు మండలాలు మినహాయించి 11 మండలాలతో వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌లు ఏర్పాటు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు జాప్యం జరిగింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండు జిల్లా ప్రజాపరిషత్‌లపై స్పష్టత వచ్చింది.
హనుమకొండ పరిధిలో
12 మండలాలు..
వరంగల్ పరిధిలో 11 మండలాలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హనుమకొండ జెడ్పీ పరిధిలో
ఐనవోలు హసన్‌పర్తి వేలేరు
పరకాల ధర్మసాగర్ ఎల్కతుర్తి
భీమదేవరపల్లి కమలాపూర్
నడికూడ దామెర ఆత్మకూరు
శాయంపేట
వరంగల్ జెడ్పీ పరిధిలో
సంగెం గీసుకొండ వర్ధన్నపేట,
పర్వతగిరి రాయపర్తి నర్సంపేట, చెన్నారావుపేట నల్లబెల్లి దుగ్గొండి, ఖానాపురం నెక్కొండ
Comments
Please login to add a commentAdd a comment