మెరుగైన వైద్యసేవలు అందించాలి
డీఎంహెచ్ఓ అప్పయ్య
ఐనవోలు: లక్ష్యాన్ని పూర్తిచేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య పీహెచ్సీలో ఓపీ, ఐపీ సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులు పరిశీలించారు. మందుల ఎక్స్పైరీ వివరాలు, ఏ మందులు ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకున్నారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి రిజిస్టర్ చేయాలన్నారు. పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవలపై డీఎంహెచ్ఓ సంతృప్తి వ్యక్తం చేసినట్లు మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment