తప్పులు లేకుండా నమోదు చేయాలి
కలెక్టర్ పి.ప్రావీణ్య
ఎల్కతుర్తి: సమగ్ర కుటుంబ సర్వేలో పేర్కొన్న అన్ని వివరాలను ఆపరేటర్లు తప్పులు లేకుండా కంప్యూటర్లలో నమోదు చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. భీమదేవరపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం డేటా ఎంట్రీని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని పూర్తిచేశారని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన వాటి సంఖ్యను సరిచేసుకోవాలని సూచించారు. కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అంతకుముందు ఎల్కతుర్తిలో బస్టాండ్ జంక్షన్ అభివృద్ధి, పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, ఏపీఓ రామా రవీందర్, ఈఈ భీంరావు, ఏఈఈ వరుణ్, ఆర్డీఓ రాఽథోడ్ రమేశ్, తహసీల్దార్లు ప్రవీణ్‌కుమార్, జగత్సింగ్, ఎంపీడీఓలు వీరేశం, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment