ధర్మసాగర్‌లో కేంద్ర బృందం పర్యటన
ధర్మసాగర్: మండల కేంద్రం, ముప్పారం, నారాయణగిరిలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులు సుధీర్‌యాదవ్, బసంత్‌నాథ్‌షైన్, రంజిత్‌సింగ్, రమేశ్‌దేశ్వాల్, సీమాఅగర్వాల్, అనామిక గుప్తా, పంకజ్ కుమార్‌ఝా, అంకిత వర్షిణి తదితరులు పలు పథకాల అమలు తీరును పరిశీలించారు. ముప్పారంలోని కేజీబీవీని సందర్శించి బాలికల సౌకర్యాలు, అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల అమలు తీరును తెలుసుకున్నారు. అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించి పిల్లలకు ఇస్తున్న బాలామృతం, పిల్లల డైట్‌ను పరిశీలించారు. మహిళా సమాఖ్య సభ్యులను కలిసి పొదుపు వివరాలపై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిల్‌కుమార్, మండల వైద్యాధికారి గోపీనాథ్, ఎంఈఓ రాంధన్, ఏపీఎం అనిత, ఎంపీఓ అఫ్జల్, కేజీబీవీ ఎస్‌ఓ మాధవి, మహిళా సమాఖ్య సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment