వివక్ష లేకుండా గ్రామాలకు నిధులు
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
● లక్ష్మీపురం, దామెరలో
జీపీ భవనాలకు భూమి పూజ
పరకాల/దామెర: వివక్ష లేకుండా అవసరాన్ని బట్టి గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం పరకాల మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, దామెర మండల కేంద్రంలో రూ.20 లక్షల ఈజీఎస్ నిధులతో గ్రామ పంచాయతీ భవనానికి మంగళవారం భూమి పూజు చేశారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలానికి రూ.1.90 కోట్ల ఈజీఎస్ నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో దామెరలో అన్ని కార్యాలయాలు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన రహదారి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ల్యాదెళ్లలోని నీటి పారుదల శాఖకు చెందిన క్వార్టర్లలో మహిళల ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటుచేసి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేవిధంగా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాలలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్ భాస్కర్, వ్యవసాయాధికారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి మల్లేశ్, దామెరలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఈ శంకరయ్య, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ మంజూల, ఏఓ రాకేశ్, జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాశ్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొలెపాక శ్రీనివాస్, నాయకులు అనిల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పోశాలు, రవి, ప్రవీణ్, రాజేందర్, భిక్షపతి, ఇందిర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment