నకిలీ సర్టిఫికెట్ ఉద్యోగి ఔట్
ఎంజీఎం: హనుమకొండ వైద్య, ఆరోగ్యశాఖలోని నేషనల్ హెల్త్ మిషన్‌లో కాంట్రాక్టు డీపీఎంగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందాడని ఈ నెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సదరు డీపీఎం రాష్ట్ర పరిధిలోని ఓ ఏజెన్సీ ద్వారా నియమితులయ్యాడు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, డీఎంహెచ్‌ఓ అప్పయ్య విచారణ చేపట్టి చర్యల నిమిత్తం కమిషనర్‌కు సిఫారసు చేశారు. దీనిపై స్పందించిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కమిషనర్.. నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన శ్రీనివాస్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఆయన సొంత ఖాతాలోకి నిధులు మళ్లించిన డబ్బులపై ప్రత్యేక విచారణ చేపట్టాలని పేర్కొన్నారు.
సొంత ఖాతాలోనిధుల జమ..
నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందిన డీపీఎం శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రభుత్వ సొమ్మును పెద్ద ఎత్తున దోచుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లె దవాఖాన వైద్యుల శిక్షణ కోసం మంజూరైన రూ.5.32 లక్షలు, ఐఈసీ మెటీరియల్స్ కోసం మంజూరు చేసిన రూ.32 లక్షలను తన సొంత ఖాతాలోకి జమ చేసుకుని తప్పుడు లెక్కలు చూపించినట్లు తెలుస్తోంది. కమిషనర్ కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించి, అందినకాడికి దోచుకున్నట్లు సమాచారం. ఆరేడు సంవత్సరాలుగా నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం చేసిన శ్రీనివాస్ ఎన్ని ఆస్తులు కూడబెట్టాడో విజిలెన్స్ విచారణ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. నామమాత్రపు చర్యల్లో భాగంగా విధుల నుంచి తొలగించకుండా ఎంత అవినీతి చేశాడో తేల్చి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
డీపీఎంను విధుల నుంచి తొలగించిన ఎన్‌హెచ్‌ఎం కమిషనర్
నిధుల దుర్వినియోగంపై
విచారణకు ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment