ఓరుగల్లు వైద్యులకు జాతీయ అవార్డులు
ఎంజీఎం: ముంబైలో నిర్వహించిన ఆసియా బెస్ట్ హెల్త్ కేర్ జాతీయ అవార్డు కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన డాక్టర్ రత్న రమేశ్, జె.ప్రదీప్, సురేశ్‌కుమార్, రామాంజనేయులు అవా ర్డులు అందుకున్నారు. ఆదివారం నిర్వహించిన ఈ సదస్సులో వివిధ స్పెషాలిటీలో వైద్యులు 250 మందికిపైగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. 61 మంది మాత్రమే అవార్డులకు ఎంపికై నట్లు హెల్త్‌వ్యూస్ మ్యాగజైన్ సీఈఓ దీప్తి వర్మ తెలిపారు. ఓరుగల్లు నుంచి నలుగు రు వైద్యులు అవార్డులు దక్కించుకోవడంపై పలువురు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: క్రిస్మస్ వేడుకలు–2024 సందర్భంగా ప్రభుత్వంనుంచి గౌరవ సత్కారం పొందగోరే అర్హులైన క్రిష్టియన్ సంస్థలు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మైనారిటీల సంక్షేమాధికా రి మురళీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవారంగం, విశిష్టమైన వైద్యసేవలు, విద్యాబోధన, సాహిత్యం, కళలు, క్రీడారంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న సంస్థలు, వ్యక్తులు సత్కారం పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను నిర్ణీత నమూనాలో జిల్లా మైనారిటీ కార్యాలయంలో డిసెంబర్ 5వ తేదీలోగా సమర్పించాలని సూచించారు.
ఎస్సై కుటుంబానికి
చెక్కు అందజేత
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో గత సెప్టెంబర్ 17న మరణించిన ఎస్సై మొగిలి కుటుంబానికి ‘పోలీస్ భద్రత’కింద మంజూరు చేసిన రూ.16లక్షల చెక్కును సోమవారం సీపీ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఆ ఎస్సై కుటుంబ సభ్యుల స్థితిగతులను సీపీ ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఓ రామకృష్ణ పాల్గొన్నారు.
ఏడుగురు డీబార్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిఽగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన డిగ్రీ 3వ సెమిస్టర్ల పరీక్షల్లో వివిధ పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ.. ఏడుగురు పట్టుబడ్డారు. వారిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి తెలిపారు.
ఎంజీఎంలో మైత్రి క్లినిక్
ఎంజీఎం: ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ఎంజీఎం ఆస్పత్రిలో మైత్రి క్లినిక్‌ను(వర్చువల్)గా ప్రారంభించారు. ఈ క్లినిక్‌లో కౌన్సిలింగ్, లింగ ఆధారిత సేవలు, లైంగిక వ్యాధులకు చికిత్సలు అందించనున్నట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ఎంజీఎం ఆర్‌ఎంఓలు మురళి, అంబి శ్రీనివాస్, క్లినిక్ కో–ఆర్డినేటర్లు సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment