వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు జాప్యం చేయొద్దని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన వినతులు సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలన్నారు. పెండింగ్ వినతులపై మరింత దృష్టి సారించాలన్నారు. ఏమైనా వినతులు తిరస్కరణకు గురైతే కారణాలు లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 129 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వై.వి గణేశ్, డీఆర్డీఓ ఎం. శ్రీనివాస్, పరకాల ఆర్డీఓ నారాయణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment