వంగర పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
ఆస్పత్రి రికార్డుల పరిశీలన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని వంగర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ అల్లం అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో మందుల వాడకం తేదీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికాలంలో వచ్చే సీజన్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సేవలందించేందుకు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. చలికాలంలో చలితీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, పిల్లలు ఎక్కువగా బయట తిరగకూడదని సూచించారు. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన, పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణను పరిశీలించారు. ఈనెల 2నుంచి 15వరకు ఇంటింటి సర్వే నిర్వహించి తెల్లని మచ్చలు, కుష్ఠువ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ప్రాథమిక చికిత్స అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయనకు వైద్య సిబ్బంది శాలువా కప్పి సన్మానించారు. డీఎంహెచ్‌ఓ వెంట డాక్టర్ రహమాన్, డాక్టర్ రుబీనా, సిబ్బంది రవిందర్‌రెడ్డి, మోహన్, సుధీర్, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment