చెక్‌డ్యాం నిర్మాణం పూర్తిచేయండి
అధికారులకు ఎమ్మెల్యే రేవూరి ఆదేశం
పరకాల : పరకాల పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ‘పడకేసిన పరకాల అభివృద్ధి’శీర్షికన ఈ నెల 2న సాక్షిలో వచ్చిన కథనానికి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన చెక్‌డ్యామ్‌ను మంగళవారం అధికారులు, రైతులతో కలిసి సందర్శించారు. చెక్‌డ్యాం పూర్తి చేయడానికి కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న చెక్‌డ్యాం శిథిలావస్థలోకి చేరినందున మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆయన ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment