గత పాలకుల తీరుతోనే ఆర్థికలోటు
పరకాల: గత పాలకులు ప్రజల కోసం కాకుండా కాంట్రాక్టుల కోసం అభివృద్ధి పనులు చేశారని, వారి పాలన తీరుతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం వెనుక బీఆర్‌ఎస్ నేతల పాపమే ఉందని స్పష్టం చేశారు. మంగళవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 7, 8 వార్డుల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి పర్యటించారు. రాజిపేట, సీతారాంపూర్‌లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు వారినుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు రూ.45 కోట్లతో అంచనా వేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మొదటి విడతగా ఇప్పటికే మంజూరైన రూ.15కోట్లలో అమృత్ పథకం కింద రూ.11 కోట్లతో వాటర్ ట్యాంక్, పైపులైన్ వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో దరఖాస్తులు స్వీకరించి గ్రామసభలు ఏర్పాటు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్‌పర్సన్ సోదా అనితారామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుష్మ, ఏసీపీ కిషోర్‌కుమార్, ఎన్పీడీసీఎల్ డీఈ దేవేందర్, కౌన్సిలర్లు నల్లెల జ్యోతి, పంచగిరి జయమ్మ, మడికొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే, నాయకులు కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎస్‌బీఐ ద్వారా మంజూరైన రూ.1.08కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా పరకాల మున్సిపాలిటీలోని ఆర్పీలతోపాటు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
ప్రజా పాలన విజయోత్సవాల్లో
భాగంగా అధికారులతో కలిసి
వార్డుల పర్యటన
Comments
Please login to add a commentAdd a comment