ప్రజాపాలనలో అన్ని వర్గాల అభివృద్ధి
ఖిలా వరంగల్: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడిందని, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరును కళారూపాల ద్వారా సాంస్కృతిక కళాకారులు అద్భుతంగా వివరించడం అభినందనీయమని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం ఖిలా వరంగల్ మధ్యకోట కీర్తి తోరణాల ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవాలు వైభవంగా జరిగాయి.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
విజయోత్సవాల్లో కళాకారులు చిందులేసి సందడి చేశారు. జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు, అలేఖ్య పుంజాల బృందం ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఊర్రూతలూగించాయి.
Comments
Please login to add a commentAdd a comment