ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
పరకాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన విజయోత్సవాలను పండుగ వాతావరణం కల్పించేలా నిర్వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర్‌రావు అన్నారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తొలి ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇబ్బందులు కలిగించొద్దు
చిరువ్యాపారస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.. నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన స్థానిక చిరువ్యాపారులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్‌తో వ్యాపారం చేయాలని, రోడ్లపై వ్యాపారాలతో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను తరలించవద్దని చిరు వ్యాపారులు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి, మున్సిపల్ చైర్‌పర్సన్ సోదా అనిత రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment