మంగళవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
కాజీపేట అర్బన్:
ప్రస్తుత సంవత్సరానికి బైబై చెబుతూ.. కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్పేందుకు వరంగల్ మహానగరం సిద్ధమైంది. గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ల వాసులు ఉమ్మడి కుటుంబాలుగా కలిసి వేడుకలు నిర్వహిస్తుంటే.. రిసార్ట్స్, హోటళ్లలో డీజే పాటలు, డ్యాన్సులతో యువత ఉర్రూతలూగనుంది. నయా సాల్ రానున్న నేపథ్యంలో నగరంలో నయా జోష్ కనిపిస్తోంది.
కొత్తగా కనిపించాలని..
న్యూఇయర్ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో షాపింగ్ మాళ్లలో సందడి నెలకొంది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజు కొత్త బట్టలు వేసుకుంటే అంతా మంచే జరుగుతుందనే భావనతో యువత షాపింగ్ మాళ్లవైపు పరుగులు పెడుతోంది.
సరదా పోటీలు.. బహుమతులు
డిసెంబర్ 31 రాత్రి మా అపార్ట్‌మెంట్‌లో సందడిగా ఉంటుంది. అన్ని కుటుంబాలు ఒక చోట చేరి వివిధ రకాల పోటీలను సరదాగా ఏర్పాటు చేసుకుంటాం. ప్రోత్సాహకంగా బహుమతులు అందజేస్తాం.
– గోలి రవీందర్,
అధ్యక్షుడు, జీఎంఆర్ బృందావన్
● నగరంలో పలు చోట్ల డిసెంబర్ 31 ఈవెంట్లకు అనుమతి
● అపార్ట్‌మెంట్లలో హవా..
● రిసార్ట్స్, హోటళ్లు
అడ్వాన్స్ బుక్
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన నగరం
Comments
Please login to add a commentAdd a comment