పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
ఎల్కతుర్తి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. గురువారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, ఎల్కతుర్తి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ రైతులకు రుణమాఫీ అమలు చేశామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని సూచించారు. పార్టీకోసం కష్టపడిన వారికి పదవులు అవే వస్తాయని, ప్రతీ ఒక్కరికి న్యాయం జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో నాయకులు చిట్టంపల్లి ఐలయ్య, ఇంద్రసేనారెడ్డి, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, కూడూరి సరోజన, గోలి రాజేశ్వర్‌రావు, సుకినె సంతాజీ, గొర్రె మహేందర్, మండ సుమన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment