చదువుతో ఉన్నత శిఖరాలకు
వేలేరు: విద్యార్థులు చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు అన్నారు. శుక్రవారం రోబోకో ఫౌండేషన్ వారి సహకారంతో మండలంలోని పీచర, మల్లికుదుర్ల, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 6,7,8,9 తరగతులు చదువుతున్న 342 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. గొప్ప స్థాయికి చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకుని విజయతీరాలకు చేరుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థికి పట్టుదల క్రమశిక్షణ ఉండాలని, గతంలో తమలాంటి వారికి ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడున్న పిల్లలకు అన్ని సౌకర్యాలున్నాయని.. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రఘు, మమత, మాజీ జెడ్పీటీసీ చాడ సరిత, వేలేరు, చిల్పూరు మండలాల అధ్యక్షులు కాట్రేవుల రాజు, గంటే ఉపేందర్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు కీర్తి సురేశ్, కిరణ్, లింగం, దామోదర్ రెడ్డి, రమేశ్, శివాజీ పాల్గొన్నారు.
మాజీ మంత్రి
డాక్టర్ గుండె విజయరామారావు
కెనరా రోబోకో ఫౌండేషన్ ద్వారా
విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment