పెద్ద దిక్కు లేక..
ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో పాలన అధ్వానంగా మారింది. నిత్యం వేలాది మంది రోగులు చికిత్స పొందే ఈ ఆస్పత్రిలో కీలకమైన సూపరింటెండెంట్, ఇతర పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పేదలకు నిరంతరం వైద్యసేవలందించే ఆస్పత్రిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కు రెఫర్..
ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ఎంతోమంది రోగులు వస్తారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా చేసిన మందులు అందుబాటులో లేని సమయంలో ఆరోగ్యశ్రీ, అత్యవసర నిధుల నుంచి కొనుగోలు చేసిన మందులు అందించాలి. కొన్ని సందర్భాల్లో వేలాది రూపాయల ఇంజక్షన్లు, ఔషధాలు, కెమికల్స్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పాలనతో అత్యవసర విభాగంలో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు, వైద్యసిబ్బంది కొరతతోపాటు కీలకమైన ఔషధాలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో రోగులను హైదరాబాద్‌కు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
ఎవరు ఎప్పుడు వస్తారో.. వెళ్తారో..
1500పడకలు ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో పాలన స వ్యంగా జరిగేందుకు సూపరింటెండెంట్‌తోపాటు ముగ్గురు ఆర్‌ఎంఓలు, ఇద్దరు అడిషనల్ ఆర్‌ఎంఓలు 24 గంటలపాటు విధులు నిర్వర్తిస్తూ రోగుల సమస్యలు పరిష్కరించాలి. కానీ, ఆస్పత్రిలో కీలక నిర్ణయాలు తీసుకునే ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ–1పోస్టులు నెలల తరబడిగా ఖాళీగా ఉంటున్నా పట్టించుకునే నాథుడేలేడు. దీంతో ఆస్పత్రిలో పాలన పూర్తి అధ్వానంగా తయారైంది. ఇన్‌చార్జ్ పాలనలో వైద్యులతోపాటు వైద్యసిబ్బంది లో సమయపాలన లోపిస్తోంది. ఎవరు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. ప్రతీ విభాగంలో అడ్మిషన్ల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఎంజీఎం ఆస్పత్రిలో పాలన అస్తవ్యస్తం
సూపరింటెండెంట్,
ఆర్‌ఎంఓ–1 పోస్టులు ఖాళీ
నిలిచిపోతున్న అత్యవసర వైద్య సేవలు
పట్టించుకోని పాలకులు, అధికారులు
వార్డుల్లోకి ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది..
ఎంజీఎంలో అవినీతి తారాస్థాయికి చేరింది. ఆస్పత్రి ఎదుట ఉన్న ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది ఏకంగా వార్డుల్లోకి వస్తూ రోగుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ప్రతి రోజు సుమారు లక్ష రూపాయల వరకు ల్యాబ్ నిర్వాహకులు దందా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా యి. ఇందుకు కొంతమంది వైద్యులు, సిబ్బంది సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై కలెక్టర్ సైతం తీవ్రంగా పరిగణించి విచారణకు సైతం అదేశాలు జారీ చేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో పాలనను మెరుగుపరిచి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment