‘కాంప్లెక్స్’ అనుమతి రద్దు చేయాలి
వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలోని ఆజంజాహి మిల్లు కార్మిక భవన స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతి రద్దు చేసి, నూతన కార్మిక భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆజంజాహి మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేర కు ఆదివారం కార్మిక భవనం కూల్చివేసిన స్థలంలో కమిటీ నాయకులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా పరిరక్షణ కమిటీ నాయకుడు మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు పెరుమాళ్ల లక్ష్మణ్, కార్మికుడు అకెన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక భవనాన్ని కూల్చివేసిన వారిపై, అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కూల్చివేసిన స్థలంలో నూతన కార్మిక భవన నిర్మాణంలో కోసం మంత్రి కొండా సురేఖ రూ.10 కోట్లు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాశిబుగ్గ జేఏసీ కన్వీనర్ డాక్టర్ కొణతం కృష్ణ, ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, వరంగల్ ప్రింటర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మాటేటి అశోక్‌కుమార్, ఆజాంజాహి మిల్లు కార్మిక కుటుంబాల సభ్యులు గంజి సాంబయ్య, చిమ్మని గోపి, గంగుల ప్రణయ్చందు, గూడూరు కృష్ణ, నున్నా అప్పారావు, సిరబోయిన రాజు, బజ్జూరి వీరేశం, ఎన్.వెంకటస్వామి, పిట్టల ఉపేందర్, మామిడి ఈశ్వరయ్య, గడ్డం సత్యనారాయణ, జంగం రాజనర్సు, కొంతం రాజేందర్, కూచన రమేశ్, కుసుమ సారంగపాణి, దూడం అనిల్, గాంధీనగర్ మహేందర్, గోనె రామచందర్, అడ్వకేట్ వడపల్లి శ్యాం పాల్గొన్నారు.
పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment