పౌష్టికాహారం అందించాలి
ఖిలా వరంగల్: గురుకుల పాఠశాలల్లో మెనూ పాటిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం ఉర్సుగుట్ట మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి న ఆమె తరగతి గదులు, వంటశాల, బియ్యం నిల్వలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు ఆకస్మిక తనిఖీలకు వస్తారని, పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడిన అనంతరం పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపణీ చేశారు. బీసీ సంక్షేమాధికారి పుష్పలత, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ప్రిన్స్‌పాల్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
నేటి గ్రీవెన్స్‌లు రద్దు
హన్మకొండ అర్బన్/వరంగల్ అర్బన్: హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో సోమవారం(నేడు) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఫిర్యాదులు అందించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.
గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ కూడా..
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నేటి(సోమవారం)గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దుచేసినట్లు క మిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనా పరమైన కారాణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆమె.. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించి ఫిర్యాదులు అందజేయడానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రాధాన్యత కోల్పోని
శతక ప్రక్రియ
హన్మకొండ కల్చరల్: పన్నెండవ శతాబ్దంలో తెలుగుభాషలో మొదలైన శతక ప్రక్రియ నేటి వరకు తన ప్రాధాన్యత కొల్పోకుండా సమాజా న్ని ప్రభావితం చేస్తున్నదని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. ఆదివారం హనుమకొండలోని ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్‌లో కాకతీయ పద్యకవితా వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో చిదిరాల సుధాకర్ రచించిన పద్య పంచశతకము ‘జీవనపోరాటం’ పుస్తకా న్ని ఆవిష్కరించారు. అనంతరం కవి సమ్మేళనంలో 30 మంది కవులు తమ కవితలతో అలరించారు. సమస్యాపృచ్చక చక్రవర్తి కంది శంకరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక సమీక్షకులుగా చేపూరి శ్రీరాం, కేయూ తెలుగు అధ్యాపకులు డాక్టర్ మంథని శంకర్, డాక్టర్ మడత భాస్కర్, కొండా యాదగిరి, అక్కెర కరుణాసాగర్, సిద్దెంకి బాబు, గుంటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ గురుకులం తనిఖీ
న్యూశాయంపేట: వరంగల్ రంగశాయిపేట శివారులోని జక్కలొద్దిలో ఉన్న మైనారిటీ గురుకులాన్ని ఆదివారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులం నిర్వహణ, విద్యావిధానంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకులం ప్రాంగణం, తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ భిక్షపతిని ఆదేశించారు. వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు నోట్స్‌బుక్స్, ప్యాడ్స్, పెన్నుల కిట్టును పంపిణీ చేశారు. వార్డెన్ అజారుద్దీన్, ఉపాధ్యాయులు రజిత, పీడీ శ్రీకాంత్, కౌన్సిలర్ సర్వర్‌మోహియొద్దీన్ ఘాజీ తదితరులు ఉన్నారు.
నేడు జిల్లాలో
మంత్రుల పర్యటన
వరంగల్: రాష్ట్ర మంతులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన ఎలకి్ట్రక్ బస్సుల ప్రారంభోత్సవం, అశోక హోటల్ జంక్షన్ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రాఫిక్‌పై పిల్లలకు అవగాహన కల్పించే పార్కు శంకుస్థాపన, రహదారి భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment