ఆదర్శం.. సావిత్రిబాయి పూలే జీవితం
● కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: సావిత్రిబాయి పూలే జీవితాన్ని మహిళా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకుని సమాజంలో బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. అనంతరం ఐదుగురు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఆర్‌ఓ వైవీ గణేశ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment