విద్యారణ్యపురి: ఈఏడాది మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. హనుమకొండ జిల్లాలో ఏ పాఠశాలలో సిలబస్ పూర్తి కాలేదో అక్కడ పూర్తి చేయాలని హెచ్‌ఎంలను సంబంధిత విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఇటీవల జిల్లా స్థాయిలో హెచ్‌ఎంల సమావేశాన్ని నిర్వహించి వారికి 40 రోజుల ప్రత్యేక కార్యాచరణను అందజేశారు. హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి ఈ విద్యా సంవత్సరంలో 12,006 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్యాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని డీఈఓ ఆదేశించారు. ఆదిశగా పాఠశాలల్లో కార్యాచరణ మొదలైంది.
ప్రతీ పాఠశాలకు బుక్‌లెట్..
జిల్లాలోని వివిధ స్థాయిల్లో విద్యార్థుల స్థితిగతులను ఆధారం చేసుకుని నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ప్రతీ సబ్జెక్టుకు రోజువారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాల పట్టికను (బుక్‌లెట్) రూపొందించారు. సబ్జెక్టుపరంగా ఏయే కాన్సెప్టులపై అత్యధిక శ్రద్ధ పెట్టాలి? అనే అంశాలను క్రోడీకరిస్తూ, సబ్జెక్టువారీగా అంశాలను నిర్ధారించారు. దీనికి సంబంధించి ప్రతీ పాఠశాలకు ఒక హార్డ్ కాపీని (బుక్‌లెట్)అందించారు.
హెచ్‌ఎంలకు 40 రోజుల
ప్లాన్ అందజేత
జిల్లాలో మొదలైన స్పెషల్ క్లాస్‌లు
రోజుకో స్లిప్ టెస్ట్
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాలో 12,006 మంది
టెన్త్ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment