జిల్లా అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలి
కలెక్టర్ ప్రావీణ్యకు ఫొటోఫ్రేమ్ అందజేస్తున్న టీఎన్జీఓస్ నాయకులు
హన్మకొండ అర్బన్: జిల్లా అభివృద్ధికి ఉద్యోగులంతా సమన్వయంతో కృషి చేసి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కోరారు. గురువారం టీఎన్జీఓస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ అధ్వర్యంలో నాయకులు కలెక్టర్ ప్రావీణ్యను కలిసి ఫొటో ఫ్రేమ్‌ను అందించారు. నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపి కలెక్టర్‌తో కేక్ కట్ చేయించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగపడే నోట్‌బుక్స్‌ను కలెక్టర్‌కు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో జిల్లాను మరింత అభివృద్ధి దిశగా దూసుకుపోయేలా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, గౌరవాధ్యక్షుడు శ్యామన్న, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి రాజేశ్, రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఈసీ మెంబర్ లక్ష్మీప్రసాద్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ‘నూతన’ వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment