వైద్యారోగ్యశాఖలో ప్రక్షాళన
ఎంజీఎం: హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖలో ప్రక్షాళన ప్రారంభమైంది. ‘సాక్షి’ కథనాలతో అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో నకిలీ సర్టిఫికెట్‌తో కొనసాగుతున్న ఉద్యోగిని తొలగించడంతోపాటు ‘మూడు రోజుల్లో 42 డిప్యుటేషన్లు’, ‘పీహెచ్‌సీల్లో మందులేవి?’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు డిప్యుటేషన్లలో ఉన్న వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో సమీక్ష నిర్వహించి వంగర హెడ్‌నర్సు డిప్యుటేషన్‌ను రద్దు చేశారు. అదేవిధంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య, వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో ఔషధ నిల్వలపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు, టెస్టులకు కావాల్సిన రీఏజెంట్స్ వంటి ఔషధ నిల్వలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో వైద్యాధికారులతో సమీక్షించారు. నెలవారీగా ఎంత మంది రోగులు చికిత్స పొందుతున్నారు, ఔషధాల సరఫరా ఎంత ఉంది, ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, కేటాయించిన త్రైమాసిక బడ్జెట్, ఎలా ఇండెంట్ చేస్తున్నారని పీహెచ్‌సీల వారీగా అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్లు, యాంటీస్నేక్ డ్రగ్స్ సరైన ఉష్ణోగ్రతలో భద్రపర్చాలని, ఫార్మసిస్టులతోపాటు స్టాఫ్‌నర్సులు, ఆయుష్ ఫార్మసిస్టుల సహకారం తీసుకోవాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్లను సరిగా నిర్వహించాలని, ఐనవోలు, కొత్తకొండ జాతరల కోసం అదనంగా మందులు సమకూర్చుకోవాలని ఆదేశించారు.
అక్రమ డిప్యుటేషన్లపై అధికారుల సమీక్ష
పీహెచ్‌సీల్లో ఔషధ నిల్వలపై
డీఎంహెచ్‌ఓ జూమ్ మీటింగ్
‘సాక్షి’ కథనాలతో దిద్దుబాటు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment