మహిళా డెయిరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టండి
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: పరకాల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మహిళా డెయిరీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో శనివారం సాయంత్రం పరకాల నియోజకవర్గంలో మహిళా డెయిరీ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యుల్లో గేదెలు ఉన్నవారిని గుర్తించి డెయిరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష నిర్వహించారు. ప్రతీ మండలంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం మండలానికి 350 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీపీఎం ఎం.శ్రీను పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తగు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మండల పంచాయతీఅధికారులు కలెక్టర్ ప్రావీణ్యను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు. ఎంపీఓల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, విమల, రవి, చేతన్‌రెడ్డి, జి.విమల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment