పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
స్టే.ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని రాయగూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాన్ని ఫిబ్రవరి 15 లోగా నిర్మాణం పూర్తి చేస్తేనే మార్చిలో బిల్లు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కింద సెల్లార్, పైన పంచాయతీ భవనం ఉండేలా.. ఇంజినీరింగ్ అధికారులు రీ ఎస్టిమేషన్ చేయాలని, అందుకు మరో రూ.10 లక్షలు మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాయగూడెం గ్రామానికి ఈసంవత్సరం 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఇస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజమణి మొగిలి, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్‌కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అవినీతికి పాల్పడితే చర్యలు
సంక్షేమ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. మండల కేంద్రంలో రూ.35 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మండల పరిధి వివిధ గ్రామాలకు చెందిన 19 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు రూ.19.2 లక్షల విలువైన చెక్కులను, 16 మందికి సీఎం సహాయ నిధి కింద రూ. 4.98 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment