నకిలీ వైద్యులపై చర్యలకు సహకరించాలి
ఎంజీఎం: నకిలీ వైద్యులపై ఐఎంఏ, తెలంగాణ వైద్య మండలి(టీజీఎంసీ) తీసుకుంటున్న చర్యల కు పోలీసు శాఖ సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను ఐఎంఏ జిల్లా నూతన అధ్యక్షుడు డాక్టర్ కె.నాగార్జునరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సీపీతోపాటు, డీసీపీ షేక్‌సలీమాను ఐఎంఏ జిల్లా నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మా ట్లాడుతూ పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు చికి త్స అందించే క్రమంలో మృతి చెందితే డాక్టర్ల నిర్లక్ష్యం లేకున్నా శవ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బుల కోసం రోగి బంధువులు కొంతమందితో కుమ్మకై ్క హాస్పిటళ్లు, సిబ్బందిపై దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మానసిక స్థైర్యం కోల్పోయి ఇలాంటి కేసులను హైదరాబాద్ కు పంపిస్తున్నామని చెప్పారు. దీంతో పేద, మధ్య తరగతి వారిపై మరింత ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ఇలాంటి అసాంఘిక శక్తులకు చోటివ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఐఎంఏ సేవా కార్యక్రమాలకు పోలీసు శాఖ సహకా రం ఉంటుందని, సంక్రమిత, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మరిన్ని శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. ఐఎంఏ జిల్లా సెక్రటరీ డాక్టర్ అజిత్ మహమ్మద్, టీజీఎంసీ పీఆర్ కమిటీ చైర్మన్, ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ వి.నరేశ్‌కుమార్, ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ మన్మోహన్ రాజు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment