కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు షురూ.. | - | Sakshi
Sakshi News home page

కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు షురూ..

Published Wed, Jan 8 2025 1:09 AM | Last Updated on Wed, Jan 8 2025 1:08 AM

కేయూ

కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు షురూ..

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య పీజీ సైన్స్‌ కోర్సుల మొదటి సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలోని విద్యా కళాశాలలో పరీక్షల నిర్వహణ తీరును రిజిస్ట్రార్‌ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ పరిశీలించారు. వారి వెంట విద్యా కశాళాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌.రణధీర్‌రెడ్డి, దూరవిద్య కేంద్రం సైన్స్‌ కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.వెంకటగోపీనాఽథ్‌ ఉన్నారు.

కేడీసీలో బోర్డు ఆఫ్‌

స్టడీస్‌ సమావేశం

విద్యారణ్యపురి: హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌) జువాల జీ విభాగంలో మంగళవారం బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సమావేశం నిర్వహించారు. సిలబస్‌, పరీక్షలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. యూ నివర్సిటీ నామినీగా కేయూ జువాలజీ విభాగం బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఈసం నారాయణ, కేడీసీ ప్రిన్సిపాల్‌ రాజారెడ్డి, జువాలజీ విభాగం అధిపతి సంజీవయ్య, సబ్జెక్టు నిపుణలు కె.గణేశ్‌, సభ్యులు అనిల్‌, వి.రాజయ్య, పి.రోహిణి, స్వామి అధ్యాపకులు పాల్గొని చర్చించారు. అటానమస్‌ స్టేట స్‌ లభించిన తర్వాత కేడీసీ ఈ విద్యాసంవత్స రం నుంచి సొంతంగా పరీక్షలు నిర్వహించనుంది.

‘పేరిణి’ రంజిత్‌కు అవార్డు

హన్మకొండ కల్చరల్‌ : వరంగల్‌కు చెందిన ప్రముఖ పేరిణి నాట్యాచార్యులు, నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ వ్యవస్థాపకులు గజ్జెల రంజిత్‌ సింగిడీస్‌ డిస్టింగ్యుస్ట్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సింగిడి కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యాన సోమవారం రాత్రి సింగిడి ఇంటర్నేషనల్‌ కల్చరల్‌ ఫెస్ట్‌–2025 నిర్వహించారు. సింగిడి కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విశ్వకర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ అలేఖ్య పుంజాల, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ టి.గౌరీశంకర్‌ అవార్డులు ప్రదానం చేశారు.

దేవాదాయశాఖ డీసీ బదిలీ

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ దేవాదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ టి.శ్రీకాంతారావును కొండగట్టు ఆంజనేయస్వామి దేవా లయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. సికింద్రాబాద్‌ ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కేఎన్‌.సంధ్యారాణికి వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ కూరాకుల జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.

నిట్‌లో టీచ్‌–25 ఎఫ్‌డీపీ

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో టీచింగ్‌ ఇంగ్లిష్‌ విత్‌ ఏఐ, క్రిటికల్‌ పెడగాలజీ అండ్‌ హిస్టరీ పేరుతో టీచ్‌–25 ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రో గ్రాం (ఎఫ్‌డీపీ) మంగళవారం ప్రారంభమైంది. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా శ్రీలంక డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ సమరవీర మాట్లాడారు. 21వ సెంచరీలో ఎదురవుతున్న సవాళ్లను యువత ఎదుర్కొనేందుకు ఎఫ్‌డీపీ వేదికగా నిలవాలన్నారు. ప్రొఫెసర్‌ కిశోర్‌కుమార్‌, విశ్వనాథన్‌, వెన్నెల పాల్గొన్నారు.

అకౌంట్‌ నుంచి రూ.87,500 మాయం

కమలాపూర్‌ : సైబర్‌ నేరగాళ్లు ఒకరి బ్యాంకు ఖాతా నుంచి రూ.87,500 మాయం చేసిన ఘటన కమలాపూర్‌ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. భీంపల్లికి చెందిన పసుల వీరప్రభాకర్‌ ఎస్‌బీఐ అకౌంట్‌ నుంచి గత నెల 30న ఉదయం సుమారు రూ.5 వేలు, మధ్యాహ్నం 12 గంటలకు రూ.22,500, ఆ తర్వాత 3 గంటలకు రూ.30 వేలు, 3.45 గంటలకు రూ.30 వేలు చొప్పున మొత్తం నాలుగు విడతలుగా రూ.87,500 డ్రా అయ్యాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటూ గత నెల 31న సైబర్‌ క్రైం విభాగానికి ఫిర్యాదు చేశాడు. అనంతరం మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కేయూ దూరవిద్య  పీజీ పరీక్షలు షురూ..1
1/2

కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు షురూ..

కేయూ దూరవిద్య  పీజీ పరీక్షలు షురూ..2
2/2

కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement